రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల బోధన రుసుములు, ఉపకార వేతనాల దరఖాస్తుకు ప్రభుత్వం గడువును నెలరోజులు పొడిగించింది. అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. పునరుద్ధరణ కేటగిరీలో 8.05 లక్షల మంది, కొత్తగా ప్రవేశాలు పొందిన వారిలో 5.02 లక్షల మంది అర్హులు ఉంటే 6,165 మంది మాత్రమే తొలుత ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30 నాటికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పెంపు - telangana scholarships deadline extended
రాష్ట్రంలో ఏటా పేద విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాల దరఖాస్తుకు గడువు పెంచింది. ఈనెల 31 వరకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియను విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
![ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పెంపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4608183-589-4608183-1569892777270.jpg)
ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పెంపు