తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీ దవాఖానాలు 350కు పెంచాలి : సీఎం ఆదేశం - హైదరాబాద్ నేటి వార్తలు

వ్యాధులతో సతమతమవుతున్న పేదలకు వైద్య సేవలను చేరువ చేసేందుకు ప్రభుత్వం హైదరాబాద్​లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసింది. వాటిని 350కు పెంచాలని సీఎం కేసీఆర్​ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 118 బస్తీ దవాఖానాలు మంచిగా పనిచేస్తున్నాయని అన్నారు.

Increase Basti hospitals to 350 at hyderabad
బస్తీ దవాఖానాలను 350కు పెంచాలి : సీఎం ఆదేశం

By

Published : Jan 26, 2020, 5:03 PM IST

Updated : Jan 26, 2020, 6:06 PM IST

హైదరాబాద్ నగరంలో పేద ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న బస్తీ దవాఖానాల సంఖ్యను 350కు పెంచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న 118 బస్తీ దవాఖానాలు బాగా పనిచేస్తున్నాయన్నారు. ప్రజలు వాటితో ఎంతో సంతృప్తిగా ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు.

వాటి సంఖ్యను గణనీయంగా పెంచాలని సూచించారు. నగరంలోని 150 డివిజన్లలో ప్రతీ డివిజన్​కు రెండు బస్తీ దవాఖానాలు ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, పేదలు నివసించే బస్తీలు, కాలనీల్లో మరిన్ని ఎక్కువ దవాఖానాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. రాబోయే నెలరోజుల్లోనే కొత్త బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు.

ఇదీ చూడండి : హైదరాబాద్ యూనివర్సిటీలో ఉద్రిక్తత

Last Updated : Jan 26, 2020, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details