రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ 129వ జయంతిని ఆదాయపన్ను శాఖతో పాటు ఎస్సీ, ఎస్టీ అధికారుల సంక్షేమ సంఘం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించింది. నాంపల్లిలోని ఆదాయపన్ను శాఖ భవనంలో అంబేడ్కర్ చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు.
'అంబేడ్కర్ స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరు ఎదగాలి' - CORONA UPDATES
హైదరాబాద్ నాంపల్లిలోని ఆదాయపన్ను శాఖ భవనంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం అధికారులంతా నిలోఫర్ ఆసుపత్రిలోని చిన్నారులు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
'అంబేడ్కర్ స్ఫూర్తితోనే ప్రతీ ఒక్కరు ఎదగాలి'
అనంతరం నిలోఫర్ ఆసుపత్రిలో చిన్నారులకు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మన దేశానికే పరిమితం కాకుండా ప్రపంచానికే మేధావిగా అంబేడ్కర్ గుర్తింపు తెచ్చుకున్నారని ఎస్సీ, ఎస్టీ అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు కొనియాడారు. ఆ మహనీయుని స్ఫూర్తితోనే తాము ఉద్యోగాలు పొంది, ఉన్నత స్థాయికి ఎదిగామని గుర్తుచేసుకున్నారు. లాక్డౌన్ వల్ల దేశంలో తిండి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ఆదుకునేందుకు రోజూ తమ వంతు సహాయం చేస్తున్నామన్నారు.