ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి, ఐటీ రిటర్స్ దాఖలు చేసి దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని తెలుగు రాష్ట్రాల ఇన్కమ్ టాక్స్ చీఫ్ కమిషనర్ శంకరన్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని ఇన్కమ్ టాక్స్ ప్రధాన కార్యాలయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న వేడుకల్లో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆదాయపన్ను శాఖ పనితీరుపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
'పన్నులు చెల్లించి, ఐటీ రిటర్స్ దాఖలు చేయండి' - ఐటీ రిటర్నులు
రాష్ట్రంలో ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి, ఐటీ రిటర్స్ దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాల ఇన్కమ్ టాక్స్ చీఫ్ కమిషనర్ శంకరన్ విజ్ఞప్తి చేశారు.

'పన్నులు చెల్లించి, ఐటీ రిటర్నులు దాఖలు చేయండి'
'పన్నులు చెల్లించి, ఐటీ రిటర్నులు దాఖలు చేయండి'
ఈ నెల 24న 159వ ఇన్కమ్ టాక్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 22న పాఠశాల, కళాశాల విద్యార్థులతో 'దేశ నిర్మాణంలో పౌరుని పాత్ర' అనే అంశంపై వ్యాస రచన, పెయింటింగ్ పోటీలను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నల్సార్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ డా.ఫైజాన్ ముస్తఫ్ఫా హజరు కానున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి : గొర్రెల పెంపకం పథకంపై హైకోర్టులో వ్యాజ్యం