రాష్ట్రంలో తొమ్మిది విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీకాలం నేటితో ముగియనుంది. వారి స్థానంలో ఐఏఎస్ అధికారులనుఇన్ఛార్జ్ గా నియమించాలని సర్కారు నిర్ణయించింది. శాతవాహన యూనివర్సిటీకి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగం కమిషనర్ చిరంజీవులు ఇప్పటికే ఇన్ఛార్జ్ వీసీగా కొనసాగుతున్నారు. ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూహెచ్, తెలంగాణ, పాలమూరు, అంబేడ్కర్, తెలుగు యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేయనుంది.
కొత్త వీసీల నియామకం కోసం కసరత్తు కొనసాగుతోంది. పదేళ్ల బోధనానుభవం ఉన్న సుమారు 150 మంది వీసీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్కరు ఐదారు యూనివర్సిటీల కోసం దరఖాస్తులు సమర్పించారు. ప్రస్తుత వీసీలందరూ మరోసారి కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు పదిహేను రోజుల్లో కొత్త ఉపకులపతుల నియామక ప్రక్రియ కొలిక్కి వస్తుందని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పదవీకాలం ముగిసిన వీసీలను ఇన్ఛార్జిగా నియమించడానికి వీలు లేకపోవడం వల్ల... ఐఏఎస్ అధికారులకు తాత్కాలిక బాధ్యతలను అప్పగించనున్నారు.
విశ్వవిద్యాలయాలకు కొన్నాళ్లు ఇన్ఛార్జ్ ఉపకులపతులే..
రాష్ట్రంలో తొమ్మిది విశ్వవిద్యాలయాల వీసీల పదవీకాలం ఈరోజుతో ముగియనుంది. వారి స్థానంలో ఇన్ఛార్జ్ ఉపకులపతులను నియమిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేయనుంది.
ఇన్ఛార్జి ఉపకులపతులను నియమిస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేయనున్న ప్రభుత్వం
ఇవీ చూడండి : 'సహ చట్టాన్ని రద్దు చేసే దిశగా ఎన్డీఏ చర్యలు'
Last Updated : Jul 24, 2019, 7:59 AM IST