తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం ప్రోత్సాహకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ

కొవిడ్ 19 చికిత్స చేస్తున్న వైద్యులతో పాటు ఇతర సహాయక చర్యలు, విధుల్లో పాల్గొంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందనున్నాయి. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రోత్సాహకాలకు సంబంధించి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

incentives to telangana government employees
సీఎం ప్రోత్సాహకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ

By

Published : Apr 21, 2020, 5:18 PM IST

కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్​ నెల ప్రోత్సాహకాలకు సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన పూర్తిస్థాయి, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు, పోలీసు విభాగంలోని వారందరికీ మొత్తం వేతనంపై పది శాతాన్ని ప్రోత్సాహకంగా ఇస్తారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే పూర్తిస్థాయి, పొరుగుసేవల పారిశుద్ధ్య సిబ్బంది, కార్మికులకు 7,500 రూపాయలను ఇవ్వనున్నారు. హైదరాబాద్ జలమండలిలోని పూర్తి స్థాయి, పొరుగుసేవల లైన్ మెన్లు, కార్మికులకు కూడా 7,500 రూపాయలు అందజేస్తారు.

జీహెచ్ఎంసీ మినహా ఇతర కార్పొరేషన్లు, పురపాలికల్లోని పారిశుద్ధ్య సిబ్బందికి ఐదు వేల రూపాయలు ప్రోత్సాహకంగా అందిస్తారు. పంచాయతీల్లోని పారిశుద్ధ్య కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్లందరికీ కూడా 5000 రూపాయలను ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు.

ABOUT THE AUTHOR

...view details