BRS Party main office Inauguration in Delhi : ఈనెల 14న దిల్లీలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు ఆ రోజు నిర్వహించే కార్యక్రమాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్ కుమార్ పరిశీలించారు. ఈ నెల 14న దిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతరం.. యాగం నిర్వహించనున్నారు. యాగశాల స్థలంతో పాటు ఆఫీస్ భవనంలో చేపట్టవలసిన మరమ్మతులు, ఫర్నిచర్ ఇతర పనులను ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి మంత్రులు పర్యవేక్షించారు. కార్యాలయం ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రేపు దిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం - BRS construction works
BRS Party main office Inauguration in Delhi : భారత్ రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 14న జరగబోయే ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ పరిశీలించారు. కార్యాలయ ప్రారంభోత్సవం కోసం సీఎం కేసీఆర్ ఈ సోమవారం దిల్లీ వెళ్లనున్నారు.
Bharat Rashtra Samithi