Telangana decade celebrations 2023 : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లోభాగంగా చివరి రోజు అయిన ఇవాళ జూన్ 22న హుస్సేన్‌సాగర్ తీరంలో ఏర్పాటుచేసిన అమర వీరులు స్మారక కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి 15 నుంచి 20వేల మంది హాజరుకావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయన్నారు.
కట్టుదిట్టమైన భద్రత.. ఇద్దరు ఎస్పీ ర్యాంక్ అధికారులు భద్రతను పర్యవేక్షించనున్నారు. బందోబస్తులో 9 మంది అదనపు ఎస్పీలు, 27 మంది ఏసీపీలు, 66 మంది ఇన్స్పెక్టర్లు, 121 మంది ఎస్సైలు, 532 మంది కానిస్టేబులు సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. దీంతో పాటు 31 ఆర్మ్‌డ్ రిజర్వ్ ప్లటూన్లు, 10 మహిళా ప్లటూన్లు, 10 ప్లటూన్ల తెలంగాణ స్పెషల్ పోలీసులు, రెండు ప్లటూన్ల క్విక్ రెస్పాన్స్ టీమ్‌లతో భద్రతను కట్టదిట్టం చేయన్నారు. వీరితో పాటు 800 మంది ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు.
ట్రాఫిక్ అంక్షలు విధింపు.. భద్రతా కారణాల దృష్ట్యా నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ద్వారా భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. స్మారక కేంద్రం ప్రారంభోత్సవ సందర్బంగా నగరంలో ట్రాఫిక్ పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నిబంధనలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.