IN Vitro Fertility Center in Gandhi Hospital : పెళ్లి అయి సంవత్సరాలు గడిచినా.. పిల్లలు పుట్టక చాలా మంది ఆస్పత్రుల చూట్టూ తిరుగుతుంటారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షల్లో ఫీజు చెల్లించి.. పిల్లలు పుట్టేందుకు చికిత్స తీసుకుంటుంటారు. నగదు అంతగా లేనివారి పరిస్థితి అయోమయమే. అలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా గాంధీ ఆసుపత్రిలో అధునాతన సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గాంధీ ఆసుపత్రిలో తల్లీపిల్లల విభాగంలోని ఐదో అంతస్థులో ప్రత్యేకంగా ఈ సేవలను హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఇకపై గాంధీ ఆసుపత్రిలో పైసా ఖర్చు లేకుండానే ఐవీఎఫ్ పద్ధతిలో సంతానం పొందే అవకాశముంది. రూ.5 కోట్లతో అత్యాధునిక ఐవీఎఫ్ చికిత్సలను అందుబాటులోకి తెచ్చినట్లు హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ప్రైవేటులో రూ.లక్షల్లో ఖర్చయ్యే ఈ ప్రక్రియను గాంధీలో మాత్రం ఉచితంగా అందించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో తెలంగాణ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని మహమూద్ అలీ తెలిపారు.
Parenting Center at Gandhi Hospital in Hyderabad : సంతానం కోసం ఆర్థికంగా స్థోమత లేకున్నా.. ఆస్పత్రుల చూట్టూ తిరుగుతూ రూ.లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. ప్రైవేట్ క్లినిక్‌లలో ఐవీఎఫ్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఇకపై గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital)లోనే ఉచితంగా ఈ పద్దతిని పొందే అవకాశముంది. వాస్తవానికి 2018లోనే గాంధీలో సంతాన సాఫల్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేవలం టెస్టులు, కౌన్సెలింగ్‌తోపాటు ఇంట్రాయుటెరిన్ ఇన్సెమినేషన్(ఐయూఐ) పద్ధతిలో సంతానం పొందేలా ప్రయత్నం చేసేవారు. ఈ పద్దతిలో భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని ప్రయోగశాల్లో శుద్ది చేసి భార్య అండాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ విధానంలో ఇప్పటికే కొందరికి సంతాన భాగ్యం దక్కింది. తాజాగా ప్రారంభం కానున్న కేంద్రంలో రూ.5 కోట్లతో అత్యాధునిక ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) చికిత్సలను అందుబాటులోకి తెచ్చామని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావుతెలిపారు. ఈ ప్రక్రియలో ల్యాబ్‌లోనే పిండాన్ని ఫలదీకరణ చేయించి.. అనంతరం మహిళ గర్భంలో పెడతారు. ఐయూఐతో పోల్చితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న చికిత్స. ప్రైవేటులో రూ.లక్షల్లో ఖర్చు అవుతుంది. గాంధీలో మాత్రం ఉచితంగా అందించనున్నారు.
గాంధీలో హెల్ప్‌డెస్క్.. బాధితుల పరిస్థితి తెలుసుకునే వెసులుబాటు