హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీశ్రీశ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు ఈనెల 9 వరకు కొనసాగుతాయి. ప్రతి రోజు మంగళ వాయిద్యాలు, సుప్రభాత సేవ, అరాధన, సహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చన, బాలభోగ నివేదన, తీర్థ ప్రసాద గోష్టి, తదితర పూజ కార్యక్రమాలను కన్నుల పండువగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇదే విధంగా తొమ్మిది రోజుల పాటు జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.
వనస్థలిపురంలో.. వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు - వనస్థలిపురంలో.. వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు
హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీశ్రీశ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు.
వనస్థలిపురంలో.. వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు
Last Updated : Oct 1, 2019, 8:54 AM IST