పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతాపార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఉదయం కూకట్పల్లి యువమోర్చా నాయకుల ఆధ్వర్యంలో ఐడియల్ చెరువు కట్టపై మార్నింగ్ వాకర్స్‌ని కలిసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం కైతలాపూర్ మైదానంలో క్రీడాకారులను కలిసి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును భాజపా అభ్యర్థి రామచంద్ర రావుకు వేసి గెలిపించాలన్నారు.
'మాయమాటలతో తెరాస మోసం చేసింది' - kukatpally latest news
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా భాజపా యువమోర్చా నాయకులు ప్రచారం నిర్వహించారు. కూకట్పల్లి నియోజక వర్గ పరిధిలో మార్నింగ్ వాకర్స్‌ను కలిసి భాజపా అభ్యర్థి రామచంద్ర రావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
మాయమాటలతో తెరాస మోసం చేసింది'
ఇంటికో ఉద్యోగం అంటూ మాయమాటలు చెప్పి తెరాస ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ విమర్శించారు. బీసీల ఆత్మగౌరవం పేరిట మోసం చేసిన తెరాసకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. అభివృద్ధిని మరిచి గిరిజనుల భూములను ఆక్రమిస్తున్న తెరాస నాయకులకు ఎందుకు ఓటు వేయాలి అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తెరాసకు తగిన గుణపాఠం చెబుతారని వెల్లడించారు.
ఇదీ చదవండి:ఆలోచనలు విత్తుదాం రండి..!