పలు బ్యాంకుల్లో మోసాలకు పాల్పడిన కేసుల్లో ఇన్ రితమ్ ఎనర్జీ లిమిటెడ్‌కు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. నిందితులు సుమారు రూ.155 కోట్ల మేర మోసం చేసినట్లు సీబీఐ, హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నంలోని దాదాపు రూ.31.80 కోట్లు విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది.
బ్యాంకులను మోసం చేశారన్న కేసులో రూ.31.80కోట్ల ఆస్తులు అటాచ్ - మోసం కేసులో ఆస్తుల జప్తు చేసిన ఈడీ
బ్యాంకులను మోసం చేశారన్న కేసులో ఇన్ రితమ్ ఎనర్జీ లిమిటెడ్‌కు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాత్కాలికంగా జప్తు చేసింది. హైదరాబాద్, విశాఖపట్నంలోని దాదాపు రూ.31.80 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.
మోసం కేసులో ఇన్ రితమ్ ఎనర్జీ లిమిటెడ్ ఆస్తుల జప్తు
నరేందర్ కుమార్ పటేల్, మధు మరుస్వామి, జిగీష్ బెన్ పటేల్ పేరిట ఉన్న ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. కేసు నమోదు కాగానే నిందితులు అమెరికా పారిపోయినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. యూఎస్ నుంచి వచ్చిన నరేందర్ కుమార్ పటేల్‌ను అహ్మదాబాద్ విమానాశ్రయంలో జనవరిలోనే అరెస్టు చేశారు. మిగతా ఇద్దరు ఇప్పటికీ అమెరికాలోనే ఉన్నారని ఈడీ తెలిపింది. ఈ కేసుల్లో మొత్తం ఏడుగురు నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.