తెలంగాణ

telangana

ETV Bharat / state

విషం చిమ్ముతున్న మూసీ..ఐదుచోట్ల ప్రాణావాయువు సున్నా.. - telangana lockdown latest news

లాక్‌డౌన్‌లోనూ మూసీ విషం చిమ్ముతోంది. కాలుష్యం నురగలు కక్కుతోంది. లాక్​డౌన్​లోనూ అయిదు చోట్ల ప్రాణవాయువు సున్నగా ఉన్నట్లు టీఎస్​పీసీబీ తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది.

in-lockdown-five-places-the-oxygen-is-zero-at-hyderabad
లాక్‌డౌన్‌లోనూ అయిదు చోట్ల ప్రాణవాయువు సున్న

By

Published : May 12, 2020, 10:36 AM IST

జనవరితో పోల్చితే ఏప్రిల్‌లో ఎలాంటి మార్పు లేదని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ) తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. హైదరాబాద్​ నగర పరిధిలో అయిదు చోట్ల ప్రాణవాయువు సున్నాగా ఉన్నట్లు తేలిందంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఎలా గుర్తిస్తారంటే..!

డీవో (నీటిలో కరిగిఉన్న ఆక్సీజన్‌), బీవోడీ పరిమాణం ఆధారంగానే ఒక నది లేదా చెరువు కాలుష్య కోరల్లో చిక్కుకున్నదా లేదా అని గుర్తిస్తారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) నిర్దేశిత పరిమితుల ప్రకారం డీవో పరిమాణం లీటర్‌ నీటిలో 4 ఎంజీలుండాలి. అంతకంటే తక్కువ ఉంటే జలచరాలు బతకవు. బయాలజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌(బీవోడీ) లీటర్‌ నీటిలో 3 ఎంజీల కంటే తక్కువగా ఉండాలి. డీవో తగ్గుతుంటే బీవోడీ పెరుగుతుంది. అంటే కాలుష్యం పెరుగుతున్నట్లు లెక్క.

అన్ని చోట్ల అధికంగా బీవోడీ..!

మూసీ నగరంలో ప్రవహించే అయిదు చోట్ల నీటి నమూనాలను సేకరించి సనత్‌నగర్‌లోని ప్రధాన ప్రయోగశాలలో పరీక్షించారు. జనవరితో పోల్చితే తగ్గిందా.. పెరిగిందా అంటూ అధ్యయనం చేశారు. లాక్‌డౌన్‌లో చాలా వరకు పరిశ్రమలు మూత పడటంతో కాలుష్యం తగ్గుతుందని భావించారు. తీరా చూస్తేనేమో జనవరిలో ప్రాణవాయువు ‘సున్న’గా ఉండగా.. ఇప్పుడు కూడా ఎలాంటి మార్పు లేదు. అయిదు చోట్ల కూడా బీవోడీ నిర్దేశిత పరిమితుల కంటే చాలా రేట్లు అధికంగా ఉండటం గమనార్హం.

ఎందుకిలా అంటే..!

పరిశ్రమల నుంచి అత్యంత ప్రమాదకరమైన ఘన, రసాయన వ్యర్థాలను మూసీలో కలిపేస్తున్నారు. వీటికి తోడు ప్రతిరోజు నగరంలో 1500 మిలియన్‌ లీటర్ల మురుగు, మానవ వ్యర్థాలు వెలువడుతున్నాయి. 750 ఎంఎల్‌డీ మురుగును మాత్రమే శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు. మిగిలినది నేరుగా కలుస్తుంది. లాక్‌డౌన్‌లో మూసీలో కలిసే రసాయన వ్యర్థాల పరిమాణం చాలా వరకు తగ్గింది. అయితే.. ఇప్పటికే కలిసిన రసాయన వల్లే ఎలాంటి మార్పు కనిపించడం లేదని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి:'కరోనా ఎక్కువ కాలం ఉంటే.. ఆ సంస్థల పని అంతే'

ABOUT THE AUTHOR

...view details