తెలంగాణ

telangana

ETV Bharat / state

Crowd in Fish Market: మాస్కు, భౌతిక దూరం వద్దు.. చేపలే ముద్దు - హైదరాబాద్​లో చేపల మార్కెట్​

Crowd in Fish Market: అసలే కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఒకవైపు థర్డ్​ వేవ్ సంకేతాలు భయపెడుతున్నాయి. దీనికి తోడు కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ సైతం వణికిస్తోంది. కానీ వాటితో మాకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు భాగ్యనగర ప్రజలు. ఒకవైపు ఊహించని రీతిలో కేసులు పెరుగుతుంటే మేం మాత్రం తగ్గేదెలా అంటున్నారు. కొవిడ్​ నిబంధనలు మాకు వర్తించవు అన్న రీతిలో గుంపులు గుంపులుగా ఎగబడ్డారు. ఇంతకీ ఎక్కడ ఈ తతంగమంతా అనుకుంటున్నారా.. అయితే చూసేయండి.

Crowd in Fish Market
రాంనగర్​ చేపల మార్కెట్​లో కొవిడ్​ నిబంధనలు పాటించని ప్రజలు

By

Published : Jan 9, 2022, 8:08 PM IST

Crowd in Fish Market: హైదరాబాద్​లో చేపలకు ఫేమస్ రాంనగర్ మార్కెట్. ఆదివారం వచ్చిందంటే చాలు ఇసుకెేస్తే రాలనంత జనం అక్కడ దర్శనమిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలోనూ ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ చేపల మార్కెట్​ వినియోగదారులతో కిక్కిరిసిపోయింది. అయితే అక్కడ కొవిడ్ నిబంధనలు మాత్రం గాలికొదిలేశారు. కరోనా కంటే మాకు చేపలే ముఖ్యం అనేలా వ్యవహరించారు.

సర్వత్రా విమర్శలు

no covid rules in fish market: ప్రస్తుత పరిస్థితుల్లో చేపల మార్కెట్​లో కొవిడ్ నియమాలను బేఖాతరు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో చేపల వ్యాపారస్తులు, వినియోగదారులు ఏమాత్రం భౌతిక దూరం పాటించకుండా క్రయ, విక్రయాలు కొనసాగించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేపల మార్కెట్ పేరు వినగానే పోలీసులు, వైద్యాధికారుల గుండెలు గుభేల్ మంటున్నాయి.

అపరిశుభ్రంగా చేపల అమ్మకం

drainage at fish market: ప్రభుత్వం కరోనా మహమ్మారి నివారణకు అనేక మార్గదర్శకాలను విడుదల చేసినప్పటికీ రాంనగర్ చేపల మార్కెట్ వ్యాపారస్తులు, టోకు వ్యాపారులు వాటిని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. దీనికి తోడు చేపల మార్కెట్​లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం.. మురుగునీరు రోడ్డుపై ప్రవహించడం, ఎక్కడపడితే అక్కడ చేపలు శుభ్రం చేయడం, చెత్త, చెదారాన్ని ఎక్కడపడితే అక్కడ వేయడంతో సమస్య మరింత జటిలంగా మారుతోంది.

అధికారులు ఏం చేస్తున్నారు?

ప్రజలు ఇలానే వ్యవహరిస్తే కరోనా మూడో దశ మరింత పెరిగే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాస్కు, భౌతిక దూరం పాటించకపోవడం, అపరిశుభ్రత మధ్యనే చేపలు విక్రయించడంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ చేపల మార్కెట్ పట్ల జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక అధికార, ప్రజా ప్రతినిధులు ఉదాసీన వైఖరి వీడాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రాంనగర్ మార్కెట్ చేపల మార్కెట్​లో రద్దీ

ABOUT THE AUTHOR

...view details