తెలంగాణ

telangana

ETV Bharat / state

హరిద్వార్​లో నిరాడంబరంగా పవన్ బస - power star pawan kalyan latest news

హరిద్వార్ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఓ చిన్న గదిలో బస చేస్తున్నారు. ఒక కుర్చీ, మంచం, ఫ్యాన్ మాత్రమే ఉన్న గదిలో ఆయన రెండు రోజులుగా ఉంటున్నారు.

హరిద్వార్​లో నిరాడంబరంగా పవన్ బస

By

Published : Oct 12, 2019, 8:57 AM IST

నిరాడంబరంగా ఉండడానికి ఇష్టపడే పవన్ కల్యాణ్ ఇప్పుడు హరిద్వార్​లోనూ అదే చేస్తున్నారు. సాదాసీదాగా ఉండే ఒక ఆశ్రమంలో ఆయన రెండు రోజులు ఉన్నారు. జనసేన అధినేత బస చేసిన ఆశ్రమం, అందులో ఆయన ఉంటున్న గదిని చూస్తే ఎవరైనా విస్మయం చెందాల్సిందే. ఒక కుర్చీ , ఒక మంచం మాత్రమే ఆ గదిలో ఉన్నాయి. ఇవాళ కూడా అక్కడే ఉంటారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ ట్వీట్ చేసింది.

గంగానది చెంత పవన్

పుణ్యక్షేత్రమైన రిషికేశ్​లో పవిత్ర గంగా నదిని పవన్ శుక్రవారం సందర్శించారు. తొలుత రిషికేశ్​లోని గంగా బ్యారేజ్ చేరుకుని అక్కడ గంగా నది ప్రవాహ ఝురిని, ఒరవడిని ఆసక్తిగా తిలకించారు. హిమాలయల్లో ఉద్భవించే గంగా నది అక్కడి నుంచి పరవళ్లు తొక్కుతూ రిషికేశ్​కు చేరుకునే వైనాన్ని ప్రొఫెసర్ విక్రం సోని, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ వివరించారు. గంగా నీటిలో 42 రకాల ఔషద లక్షణాలు ఉన్నాయని వివరించారు. ప్రధాన కాలువ మార్గమంతా దట్టమైన అడవితో నిండి ఉంది. అటవీ మార్గం మధ్యలో చిల్లా అనే ప్రాంతంలో ఆగి కాసేపు గంగా కాలువ ఒడ్డున కూర్చుని తదేకంగా గంగను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి హరిద్వార్ చేరుకుని సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మాత్రి ఆశ్రమానికి వెళ్లారు.

హరిద్వార్​లో నిరాడంబరంగా పవన్ బస

ఇవీ చూడండి: జిన్​పింగ్​ రెండోరోజు పర్యటన సాగనుంది ఇలా..

ABOUT THE AUTHOR

...view details