తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా బాధితులకు గాంధీలో మెరుగైన చికిత్స : డా. శ్రవణ్‌ - గాంధీ ఆసుపత్రి కరోనా చికిత్స

కరోనా బాధితులకు గాంధీ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యశాల సూపరింటెండెంట్ డా. శ్రవణ్ కుమార్ తెలిపారు. వైరస్ బారిన పడిన వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు వెల్లడించారు.

గాంధీ ఆసుపత్రి
గాంధీ ఆసుపత్రి

By

Published : Apr 19, 2020, 8:33 PM IST

కొవిడ్‌-19 బారిన పడిన వారిని కాపాడేందుకు సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి వైద్యులు నిరంతరం శ్రమిస్తున్నారని వైద్యశాల సూపరింటెండెంట్ డా. శ్రవణ్ కుమార్ అన్నారు. కరోనా బాధితులను కంటికి రెప్పలా చూసుకుంటున్నారని చెప్పారు. బాధితులు వైరస్ బారి నుంచి త్వరగా బయటపడేందుకు పోషకాలతో కూడిన ఆహార పదార్థాలను అందిస్తున్నామన్నారు. ఉదయం పాలు, బ్రెడ్డుతోపాటు మధ్యాహ్నం రెండు రకాల కూరలు, అన్నం, పెరుగు, గుడ్డును అందజేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం వేళలో డ్రై ఫ్రూట్స్‌ను ప్రత్యేకంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రాత్రి భోజనంలో పోషకాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. పోషక పదార్థాలతో కూడిన ఆహారం మూలంగా బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details