ఉస్మానియా యూనివర్సిటి భూములు అన్యక్రాంతం అవుతున్నాయని చెలరేగిన వివాదంపై జీహెచ్ఎంసీ స్పందించింది. ఆ ప్రాంతంలో చేపడుతన్న నిర్మాణాలకు అనుమతి లేనందున జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి నర్సింగరావు అధ్వర్యంలో సిబ్బంది గోడలను తొలగిస్తున్నారు.
ఓయూలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం - ఉస్మానియా యూనివర్సిటి తాజా వార్తలు
ఉస్మానియా యూనివర్సిటిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఓయూ భూమిలో కట్టిన నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు.
ఓయూలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
వర్సటీ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని ఓయూ రిజిస్ట్రార్, ఎస్టేట్ అధికారి ఇటివలే జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే పీసీసీ ఛీఫ్ ఉత్తమ్‌కుమర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.
ఇదీ చూడండి :'కార్లు ఎందుకు తగలబడుతున్నాయో తెలుసుకోండి..'