ఆషాఢ బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్ పార్శిగుట్టలోని మధురానగర్ కాలనీలో గల శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారు బంగారు కవచంలో కొలువుదీరారు. స్వర్ణపు కవచంతో దర్శనమిస్తున్న మైసమ్మ.. అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఆకట్టుకుంటున్న శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి అలంకరణ - శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి తాజా వార్తలు
ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా పార్శిగుట్టలోని శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి అలంకరణ అందరినీ ఆకట్టుకుంటుంది. రకరకాల పుష్పాలు, నగలు, ధూపదీప నైవేద్యాల నడుమ అమ్మవారి అలంకరణ శోభాయమానంగా ఉంది.
![ఆకట్టుకుంటున్న శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి అలంకరణ Impressive Sri Bangaru Mysamma ammavari decoration](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8084770-195-8084770-1595139713897.jpg)
ఆకట్టుకుంటున్న శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి అలంకరణ
కరోనా వైరస్ నేపథ్యంలో బోనాల పండగ ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రభుత్వ సూచన మేరకు ఎవరి ఇళ్లలో వారు ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు.
ఆకట్టుకుంటున్న శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి అలంకరణ