రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన ప్రముఖ నృత్యగురువు అజయ్ చక్రవర్తి శిష్యురాలు అఖిల హర్షిణి కూచిపూడి అరంగేట్రం ఆద్యంతం ఆకట్టుకుంది. గణపతి వందనంతో శుభారంభం చేసి,వివిధ అంశాలను కూచిపూడి శైలిలో నర్తించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది చిన్నారి అఖిల. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని అఖిలను అభినందించారు. రవీంద్రభారతి ఒక సరస్వతి నిలయమని మామిడి హరికృష్ణ కొనియాడారు. అఖిల చిరు ప్రాయంలోనే ఎంతో ప్రావీణ్యం సాధించి, చక్కటి అభినయంతో ఆకట్టుకుంటుందని హరికృష్ణ అభినందించారు.
ఆకట్టుకున్న అఖిల హర్షిణి కూచిపూడి రంగప్రవేశం - debut
హైదరాబాద్ రవీంద్రభారతిలో చిన్నారి అఖిల హర్షిణి కూచిపూడి రంగప్రవేశం నేత్రపర్వంగా సాగింది. చక్కటి హావ, భావ, లయ నాట్య విన్యాసాలతో అఖిల కళాప్రియులను మైమరింపించింది.
ఆకట్టుకున్న అఖిల హర్షిణి కూచిపూడి రంగప్రవేశం
ఇదీ చూడండి:కన్నెపల్లి పంపుహౌస్‌లో ఐదో పంపు ప్రారంభం