ఈ-ఓటింగ్ విధానాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఆ తర్వాత గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో విస్తృతంగా అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వ సిబ్బంది, కరోనా కారణంగా క్వారంటైన్లో ఉన్న ఓటర్లు, వయో వృద్ధులకు ప్రయోగాత్మకంగా ఈ-ఓటింగ్ ద్వారా ఓటుహక్కు కల్పించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు.
గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఈ-ఓటింగ్: ఎస్ఈసీ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఈ-ఓటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. ఆ తర్వాత గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో విస్తృతంగా అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఈ-ఓటింగ్: ఎస్ఈసీ
ఈ-ఓటింగ్ విధానంలో ఇమిడి ఉన్న సాంకేతిక అంశాలు, నమోదు విధానం, గోప్యత తదితర అంశాలపై ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం చర్చించింది. సాధ్యమైనంత త్వరలో నిబంధనలు పాటిస్తూ సాఫ్ట్వేర్ను రూపొందించి డెమో ఇవ్వాలని ఎస్ఈసీ కోరింది. ఈ-ఓటింగ్ విధానాన్ని పాటించేందుకు పురపాలకశాఖను సంప్రదించి ఉత్తర్వులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని జయేష్ రంజన్ కు సూచించారు.