తెలంగాణ

telangana

ETV Bharat / state

Impact of Smartphone Usage in Children : డేంజర్​ బెల్స్​.. పిల్లలకు స్మార్ట్​ఫోన్​ ఇస్తున్నారా.? తస్మాత్ జాగ్రత్త

Impact of Smartphone Usage in Children : ఇప్పుడంతా టెక్నాలజీ​ యుగం.. స్మార్ట్​ఫోన్ ప్రపంచాన్ని​ శాసిస్తోంది. రైల్వే టికెట్​ బుకింగ్​ నుంచి బ్యాంక్​ఖాతా ఓపెనింగ్ వరకు స్మార్ట్​ఫోన్​తో చేసే రోజులు వచ్చాయి. వీటితో లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయి. పిల్లలు వీటి వాడకానికి అలవాటు పడ్డారంటే.. వారి శారీరక, మానసిక అభివృద్ధిపై ప్రభావం చూపుతోందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కథనం.

Harms of Smartphone Usage in Kids
Impact of Smartphone Usage in Children

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2023, 1:25 PM IST

Impact of Smartphone Usage in Children : మన దగ్గర స్మార్ట్​ఫోన్​ ఉంటే చాలు.. ప్రపంచం మన చేతిలో ఉన్నట్లే. ఇంటర్‌నెట్‌ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా స్మార్ట్​ఫోన్స్‌ రాకతో.. అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల లాభాలున్నాయి. అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా పిల్లలలో తీవ్ర ప్రభావం చూపుతోంది.

Kalti ice cream in Hyderabad : మీ పిల్లలు తింటోంది ఐస్​క్రీమా లేక చల్లని విషమా..?

Harms of Smartphone Usage in Kids : ముఖ్యంగా నేడు రకరకాల వీడియో గేమ్స్‌ పిల్లలను, పెద్దలను వాటి గారడీలో పడేస్తూ ఓ ఆట ఆడిస్తున్నాయి. వారి భవితపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటికి పూర్తిగా బానిస కావడం వల్ల పిల్లలలో మానసిక ఎదుగుదల లోపిస్తోంది. స్మార్ట్​ఫోన్లను తరచుగా వినియోగించడం వల్ల.. పిల్లలు చదువుపై దృష్టి సారించడంలేదని, భార్యా భర్తల మధ్య గొడవలు సంభవిస్తున్నాయని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.

విమల్​ అనే ఎనిమిదో తరగతి విద్యార్థి గత కొంతకాలంగా తరచుగా గాల్లో ఎగురుతూ, గోడల మీది నుంచి దూకుతూ ఇంట్లో వింత ప్రవర్తనలతో భయాందోళనలు కలిగిస్తున్నాడు. అప్రమత్తమైన తల్లిదండ్రులు వెంటనే పట్టణంలోని.. ఓ ఆస్పత్రిలో వైద్యుడికి చూపించారు. కానీ ఆ బాలుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. పిల్లవాడిని కొద్ది రోజులు ఇంట్లోనే.. ఒంటరిగా ఉంచి రహస్యంగా గమనించడం మొదలు పెట్టారు. రోజంతా స్మార్ట్​ఫోన్​లోనే గడుపుతూ ఉండటాన్ని గమనించారు. ‘బ్లూవేల్‌’ అనే వీడియోగేమ్​ అతడిని ఆ చేష్టలకు ప్రేరేపిస్తున్నట్లు గుర్తించి విస్తుపోయారు.

మీ పిల్లలు ఫోన్​లో ఏం చూస్తున్నారో తెలుసుకోవాలా..? అయితే ఇలా చేయండి

Smartphone Addiction in Children : హైదరాబాద్​కు చెందిన ఓ బాలిక పదోతరగతి చదువుతోంది. ఇంట్లో ఉన్నంత సేపు స్మార్ట్​ఫోన్​లో కార్టూన్​లు, వీడియో గేమ్​లు చూసేందుకే పరిమితం అవుతోంది. దీంతో చదువుల్లో వెనుకబడిపోయి.. పరీక్షల్లో మార్కులు తగ్గిపోయాయి. తీరా.. ఆరా తీస్తే కొంత కాలంగా స్మార్ట్​ఫోన్​ను ఎక్కువగా వినియోగిస్తోందని.. స్నేహితులతో కార్టూన్‌ వీడియోల పాత్రలు, వీడియో గేమ్స్​ గురించి ఎక్కువగా మాట్లాడుతోందని తేలింది.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసే యువకుడు.. నిత్యం వికారాబాద్‌ నుంచి భాగ్యనగరంకు రైల్లో రాకపోకలు సాగిస్తాడు. ఈ క్రమంలో రైల్లో ప్రయాణిస్తుండగా స్మార్ట్​ఫోన్​లో వీడియో గేమ్స్‌లో లీనమయ్యాడు. తను దిగాల్సిన స్టేజీని గమనించక పోవడంతో.. రైలు చివరి స్టేజీ కర్ణాటకలోని రాయచూర్‌లో దిగాల్సి వచ్చింది.

Psychiatrist Advices on Smartphone Addiction :పిల్లలకు అస్తమానం ఫోన్లు ఇవ్వడం మంచిది కాదు. స్మార్ట్‌ఫోన్‌ వాడకం మద్యపానం కంటే ప్రమాదకరం. ఇంటర్​ పూర్తయ్యే వరకు స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వాల్సిన పనిలేదు. ఒకవేళ తప్పనిసరిగా స్మార్ట్​ఫోన్​ ఇవ్వాల్సిన పరిస్థతి తలెత్తితే కుటుంబసభ్యులు, తల్లిదండ్రుల సమక్షంలో ఉపయోగించుకునేలా చేయాలి. క్లాస్​రూం ప్రాజెక్టు వర్కుల పేరుతో ఫోన్‌ తీసుకొని వీడియోగేమ్‌లు ఆడుతూ, అశ్లీల చిత్రాల బారిన పడి దారితప్పుతున్నారు. ప్రాజెక్టు వర్కుకు ఏం కావాలో మనమే సమకూర్చాలి. - సేవక్‌కుమార్‌, మానసిక, వ్యక్తిత్వ వికాస నిపుణులు

మీ పిల్లలు జంక్ ఫుడ్‌ బాగా తింటున్నారా?.. ఇవి పాటిస్తే సేఫ్.. లేదంటే..!

ABOUT THE AUTHOR

...view details