రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి హైదరాబాద్‌కు చెందిన జినోమ్ ల్యాబ్స్ సరికొత్త 'ఆయుష్ క్వాత్' పౌడర్‌ను అందుబాటులోకి తెచ్చింది. కొవిడ్-19 వైరస్ దాడితో మానవుల్లోని రోగనిరోధక శక్తి మందగిస్తున్న తరుణంలో ఈ ఉత్పాదన చాలా ఉపయోగపడనుంది. ఈ ఉత్పాదనను హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ఆవిష్కరించారు. కరోనా వైరస్‌కు ఔషధం అందుబాటులోకి వచ్చేందుకు చాలా సమయం పడుతుందన్న కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా... రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి దీనిని రూపొందించినట్లు జినోమ్ ల్యాబ్స్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు. ఈ పొడిని డికాక్షన్లో మాదిరిగా వేసుకొని... తాగాలని వివరించారు.
రోగ నిరోధక శక్తికి ఔషధం.. 'ఆయుష్ క్వాత్' - new products of Genome Labs
రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి హైదరాబాద్‌కు చెందిన జినోమ్ ల్యాబ్స్ సరికొత్త 'ఆయుష్ క్వాత్' పౌడర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఉత్పాదనను గురువారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ఆవిష్కరించారు. నిత్యవసర సేవల విభాగంలో పని చేస్తోన్న లక్ష మందికి దీనిని ఉచితంగా పంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది జినోమ్ ల్యాబ్స్.
కేరళ, కర్ణాటకల నుంచి తెప్పించిన తులసి, దాల్చిన చెక్క, శొంఠి, నల్లని మిరియాలతో ఈ పౌడర్‌ను రూపొందించామన్నారు. రోగనిరోధక శక్తి పెరిగితే... కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుందని జినోమ్ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. ప్రస్తుతం కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో నిత్యవసర సేవలందిస్తున్న వివిధ రంగాల్లోని లక్ష మందికి దీనిని ఉచితంగా పంపిణీ చేయనున్నామని వారు తెలిపారు. ఇతరులకు ఎవరికైనా అవసరం ఉంటే బంజారాహిల్స్‌లోని కార్యాలయానికి వస్తే ఉచితంగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ నాగరాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :మీరు కాఫీ తాగుతున్నారా...? అయితే ఇవి తెలుసుకోండి!
TAGGED:
immunity booster