హైదరాబాద్ హైదర్‌నగర్ బస్ షెల్టర్‌ను వెంటనే నిర్మించాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. డివిజన్లో బస్ షెల్టర్ నిర్మించాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేసిన ఆందోళనలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హైదర్‌నగర్‌లో జాతీయ రహదారిపై ఉన్న బస్సు షెల్టర్‌ను మెట్రో పనుల కోసం నాలుగేళ్ల కిందట తొలగించారని... ఇప్పటి వరకు నిర్మించ లేదని తెలిపారు.
'హైదర్‌నగర్‌లో బస్‌షెల్టర్‌ను వెంటనే నిర్మించాలి' - Protest for Bus shelter in Hydernagar Hyderabad
రాష్ట్ర మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న హైదరాబాద్ హైదర్‌నగర్‌లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని తెలంగాణ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రవికుమార్ యాదవ్ ఆరోపించారు. డివిజన్లో బస్ షెల్టర్ నిర్మించాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేసిన ఆందోళనలో ఆయన పాల్గొని మాట్లాడారు.
!['హైదర్‌నగర్‌లో బస్‌షెల్టర్‌ను వెంటనే నిర్మించాలి' Bus_Shelter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6002528-564-6002528-1581154595683.jpg)
Bus_Shelter
మంత్రి కేటీఆర్ దత్తత తీసుకొన్న డివిజన్లో ఏమాత్రం అభివృద్ధి జరగడం లేదని... ఇక్కడే సమస్యలు కోకొల్లలుగా ఉంటే మాములు డివిజన్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. డివిజన్లోని అలీ తలాబ్ చెరువులో గుర్రపు డెక్క తొలగించనందున దోమల సమస్య ఎక్కువైందన్నారు. వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని... లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
బస్‌షెల్టర్ నిర్మించాలని హైదర్‌నగర్‌లో ఆందోళన
ఇదీ చూడండి :మేడారం జాతరకు వెళ్లొచ్చేలోపు ఇళ్లు గుల్ల