కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఓయూ ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గాలి వినోద్ డిమాండ్ చేశారు.
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని కులాలు, వర్గాలను సమానంగా చూస్తామని ప్రమాణం చేసి .. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ధర్మారెడ్డి తక్కువ చేసి మాట్లాడారని వినోద్ మండిపడ్డారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఎమ్మెల్యేపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్మారెడ్డిని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా బర్తరఫ్ చేసే బాధ్యత స్పీకర్‌పై ఉందన్నారు. ధర్మారెడ్డి వ్యాఖ్యలపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని వినోద్ తెలిపారు. త్వరలో ఛలో పరకాల కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.