రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కుమురం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, జనగామ, వరంగల్ పట్టణ, గ్రామీణ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణ పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. ఈ ఆవర్తనం నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలో మీటర్ల నుంచి 3.1కి లో మీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది.