ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్(Hyderabad weather updates) వాతావరణ కేంద్రం ప్రకటించింది(telangana weather report). మయన్మార్ తీరం దాని పరిసర మర్తబన్ గల్ఫ్ ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం... ట్రోపోస్పిరయ్ ఎత్తు వరకు కొనసాగుతుందని తెలిపింది. ఇది వాయువ్య దిశలో కదిలి ఈశాన్య పరిసర తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి చేరుకుని ఈ నెల 24న సాయంత్రానికి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు(imd weather report).
telangana weather report: నేడు రేపు భారీ వర్షాలు - హైదరాబాద్లో వర్షాలు
రాష్ట్రంలో నేడు, రేపు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు (imd weather report). రాగల మూడు రోజుల్లో చాలా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని (rains in telangana) ప్రకటించారు.
weather
ఈ అల్పపీడనం తదుపరి 24గంటలలో ఒడిశా తీరం చేసుకునే అవకాశం ఉందన్నారు. ఉపరితల ఆవర్తనం తెలంగాణ పరిసర ప్రాంతాలో సగటు సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 4.5కిమీ మధ్యలో కొనసాగుతుందని సంచాలకులు వివరించారు. దీని ప్రభావంతో రాగల మూడురోజుల్లో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు(rains in telangana) కురుస్తాయని ప్రకటించింది.
ఇదీ చూడండి:rain in Hyderabad: భాగ్యనగరంలో ఎడతెరిపిలేని వర్షం..