అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు(rains in telangana) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(weather report) ప్రకటించింది. బంగాల్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతున్నట్లు వెల్లడించింది.
RAINS: ఉపరితల ద్రోణి ప్రభావం.. మూడు రోజులు తేలికపాటి వర్షాలు - హైదరాబాద్ వాతావరణశాఖ సమాచారం
దక్షిణ గాంగ్‌టక్ నుంచి తెలంగాణ (rains in telangana)వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (rains)కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ(weather report) వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది.
దక్షిణ గాంగ్‌టక్ నుంచి తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని తెలిపింది. సముద్రమట్టానికి 5.8 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉండి..ఎత్తుకి వెళ్లే కొలదీ నైరుతి దిశవైపుకి వంపు తిరిగి ఉన్నట్లు పేర్కొంది. అదే విధంగా సముద్రమట్టానికి 3.1 కి.మీ. ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు, ఎల్లుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాముందని వెల్లడించింది. రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చని వాతావరణశాఖ తెలిపింది.
ఇదీ చూడండి:Heavy Rainfall Alert : మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం!