తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇక గజగజే: జనవరి తొలివారం నుంచే వణుకు - జనవరి తొలివారం నుంచి పెరగనున్న చలి

జనవరి తొలివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో చలి తీవ్రత తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.

imd weather report
జనవరి తొలివారం నుంచి పెరగనున్న చలి

By

Published : Dec 26, 2019, 5:05 PM IST

తెలంగాణలో రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆగ్నేయ దిశ నుంచి తేమ గాలులు వీస్తున్నాయని... వీటి ప్రభావంతో ఉత్తర తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.

నిజామాబాద్‌, రామగుండంలో సాధారణం కన్నా 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. నల్గొండ, మెదక్‌లో అతి తక్కువగా 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. హైదరాబాద్‌లో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలకు గాను 21 డిగ్రీల మేర నమోదవుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత తక్కువగా ఉందని.. జనవరి తొలివారం నుంచి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇదీ చూడండి: నగరంలో చీకటి పడితే చాలు గల్లీకో గాంధారి పుత్రుడు..

ABOUT THE AUTHOR

...view details