ఈరోజు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళవారం, బుధవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. ఉత్తర అరేబియా సముద్రంలో మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, డయ్యూ మొత్తం ప్రాంతాలు, మధ్యప్రదేశ్ లో మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బిహార్లో మిగిలిన ప్రాంతాలు, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.
రెండురోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు - హైదరాబాద్ వాతావరణ కేంద్రం అప్డేట్స్
ఇవాళ్టితోపాటు రాగల రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
రాగల రెండు రోజులు రాష్ట్రంలో మోస్తారు వర్షాలు
తూర్పు మధ్యప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాలు, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు రాగల 48 గంటలలో విస్తరించే అవకాశం ఉందన్నారు. ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ. నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా జూన్ 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
ఇవీ చూడండి: చెత్త ఏరుకునే బాలికపై అత్యాచారయత్నం... యువకుల దేహశుద్ధి