తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో 3 రోజులపాటు తేలికపాటి జల్లులు - ap news

రానున్న రెండు, మూడు రోజుల్లో ఏపీలో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరకోస్తా, రాయలసీమల్లో తేలికపాటి జల్లులు పడతాయని.. దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు.

ఏపీలో వర్షాలు
rains in ap

By

Published : Apr 14, 2021, 7:54 AM IST

ఏపీలో రానున్న 3 రోజుల వరకు.. ఉత్తర కోస్తాఆంధ్ర, యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. రాయలసీమలో రెండు రోజులూ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడనున్నట్లు అంచనా వేసింది.

పశ్చిమ బంగ, సిక్కిం నుంచి దక్షిణ ఛత్తీసగఢ్ వరకు జార్ఖండ్, ఒడిశా మీదుగా ఒక‌టిన్న‌ర కిలోమీట‌ర్ ఎత్తులో... ఉప హిమాలయాల వద్ద ఉపరితల ద్రోణి వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:హైదరాబాద్​లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

ABOUT THE AUTHOR

...view details