నైరుతి రుతుపవనాల ఆగమనంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రేపు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. నైరుతి పవనాల రాక ఆలస్యం కావడం వల్ల జూన్లో లోటు వర్షపాతం నమోదైందని అన్నారు. రాబోయే రోజుల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందంటోన్న వాతావరణ శాఖ అధికారిణి శ్రావణితో ఈటీవీభారత్ ముఖాముఖి...
'48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు'
నైరుతి రాక ఆలస్యం కావడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు లోటు వర్షపాతం నమోదైంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడల ప్రభావం వల్ల రాబోయే రెండు రోజుల్లో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వాతావరణ కేంద్రం