అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ వల్ల నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైందని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. గాలిలోని తేమ శాతం దిశ మార్చుకోవడం వల్ల రుతుపవనాలు మందగించాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారిణి నాగరత్న తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందంటున్న వాతావరణశాఖ అధికారిణి నాగరత్నతతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
మరో రెండు రోజుల్లో... తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు - హైదరాబాద్ వాతావరణ శాఖ
రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముందస్తు అంచనాల ప్రకారం ఈసారి దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మరో రెండు రోజుల్లో... తెలుగు రాష్ట్రాలకు బుతుపవనాలు