తెలంగాణ

telangana

ETV Bharat / state

'జూన్​ 15 లోగా రాష్ట్రానికి రుతుపవనాలు' - జూన్​ 15 లోగా రాష్ట్రానికి రుతుపవనాల రాక

కేరళకు చేరిన నైరుతి రుతుపవనాలు ఐదు రోజుల్లో తెలుగురాష్ట్రాలకు రానున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ఏడాది రుతుపవనాల ఆగమనం మందకొడిగా సాగినప్పటికీ రానున్న కాలంలో చురుగ్గా సాగనున్నాయని... దేశంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.

ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్లే

By

Published : Jun 8, 2019, 8:27 PM IST

Updated : Jun 9, 2019, 6:04 AM IST

నైరుతి రుతుపవనాలు ఇవాళ ఉదయమే కేరళ తీరాన్ని తాకాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జూన్‌ 15 లోగా రుతుపవనాలు పూర్తిగా విస్తరించనున్నాయని వాతావరణశాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కారణం నైరుతి రుతుపవనాలు కాదని... ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్లేనని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్య భారతదేశంలో సాధారణ వర్షాపాతం నమోదవుతుందంటున్న వాతావరణ శాఖ అధికారిణి శ్రావణితో ఈటీవీ భారత్​ ప్రతినిధి జ్యోతికిరణ్‌ ముఖాముఖి.

ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్లే
Last Updated : Jun 9, 2019, 6:04 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details