హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, తార్నాకా, ఉప్పల్, మియాపూర్, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, ఖైరతాబాద్, లక్డీకాపూల్, దిల్‌షుక్‌నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాజ్‌భవన్ రోడ్డులోని లేక్‌వ్యూ అతిథి గృహం వద్ద నిలిచిన వర్షపు నీటిని జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. ఏకదాటిగా కురిసిన వర్షానికి ఆదిలాబాద్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కూలిన భవనం
భారీ వర్షానికి శంషాబాద్ మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న పురాతన భవనం కుప్పకూలింది. భవనం ఎదుట ఉంచిన కారు మీద శిథిలాలు పడడంతో ధ్వంసమైంది. భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
మునిగిన వంతెన... నిలిచిన ట్రాఫిక్
ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలం సవర్గామ్ వాగు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏకధాటిగా కురుసిన వర్షానికి వంతెన పైనుంచి వరద నీరు పోటెత్తడంతో రెండు గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి.
వ్యాపారుల ఇక్కట్లు