వైద్యులపై దాడులకు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ హైదరాబాద్‌లో ఆందోళనకు దిగింది. దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా నల్ల రంగు బ్యాడ్జీలు, నల్ల మాస్కులు ధరించి... కోఠిలోని ఐఎంఏ భవనం ముందు నిరసన చేపట్టారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న తమపై దాడులు చేయడం సరికాదని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లవకుమార్, ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి అన్నారు.
'ప్రాణాలకు తెగించి సేవలందిస్తే.. డాక్టర్లపై దాడులా?' - తెలంగాణ వార్తలు
డాక్టర్లపై జరుగుతున్న దాడుల పట్ల ఐఎంఏ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విపత్కర కాలంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తే దాడులు చేయడం సరికాదని పేర్కొంది. ఈ దాడులను వ్యతిరేకిస్తూ కోఠిలోని ఐఎంఏ భవనం ఎదుట ఆందోళన చేపట్టారు.
ఐఎంఏ ఆందోళన, డాక్టర్ల ధర్నా
ఇప్పటికే దేశవ్యాప్తంగా 700 మంది వైద్యులు కొవిడ్‌పై పోరాటంలో ప్రాణాలను కోల్పోయారని తెలిపారు. అయినప్పటికీ దాడులు జరగడం బాధాకరమన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్లపై దాడులు పునరావృతం కాకుండా చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:అమ్మమ్మ షరతు- చనిపోయిన బాలుడు బతికొచ్చాడు