తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఐఎంఏ వైద్యుల ధర్నా - ఆయుర్వేద వైద్యులను సర్జరీలకు అనుమతించడంపై రిలే నిరాహార దీక్షలు

ఆయుర్వేద వైద్యంలో సర్జరీలు అనుమతించడాన్ని ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​ సభ్యులు ఖండించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. మిక్సోపతి విధానానికి వ్యతిరేకంగా హైదరాబాద్​ కోఠిలోని ఐఎంఏ భవన్​లో చేపట్టిన 14 రోజుల రిలే నిరహారదీక్ష చివరి రోజు పెద్దఎత్తున వైద్యులు పాల్గొన్నారు.

IMA doctors dharna at koti ima bhavan in hyderabad
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఐఎంఏ వైద్యుల ధర్నా

By

Published : Feb 14, 2021, 7:07 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిక్సోపతి వైద్య విధానాన్ని రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఇండియన్​ మెడికల్ అసోసియేషన్​ రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడుతామని ఐఎంఏ సభ్యులు వెల్లడించారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా హైదరాబాద్​ కోఠిలోని ఐఎంఏ భవన్​లో చేపట్టిన 14 రోజుల రిలే నిరహార దీక్షల చివరి రోజు పెద్దఎత్తున వైద్యులు పాల్గొన్నారు.

ఆయుర్వేదం, హోమియోపతి వైద్యులు 56 రకాల శస్త్ర చికిత్సలు చేయవచ్చని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్యులు ఆరోపిస్తున్నారు. శస్త్ర చికిత్సలో అనుభవం లేని వారికి అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశామన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని మిక్సోపతి వైద్య విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశ్యవ్యాప్తంగా ఆందోళనను ఉద్ధృతం చేస్తామని ఐఎంఏ రాష్ట్ర కమిటీ సభ్యులు హెచ్చరించారు.

ఇదీ చూడండి :రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి: భట్టి విక్రమార్క

ABOUT THE AUTHOR

...view details