ఆయుర్వేద వైద్యాన్ని, ఆధునిక వైద్య విధానంతో కలుపుతూ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెడిసిన్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ డిమాండ్ చేసింది. సీసీఐఎం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ.. నేడు దేశ వ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు లవ కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొవిడ్, అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
నేడు దేశ వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు బంద్: ఐఎంఏ
ఆయుర్వేద పీజీ వైద్యులకు 58 రకాల శస్త్ర చికిత్సలకు అనుమతి ఇవ్వడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెడిసిన్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ గెజిట్ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ.. నేడు దేశ వ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
నేడు దేశ వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు బంద్: ఐఎంఏ
పలు విభాగాలకు చెందిన ఆయుర్వేద పీజీ వైద్యులకు 58 రకాల శస్త్ర చికిత్సలకు అనుమతి ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయుర్వేదాన్ని ఆధునిక వైద్య విధానంతో కలిపితే అది మిక్సోపతి అవుతుందని.. దానిని తాము అంగీకరించబోమని పేర్కొన్నారు. ఇలాంటి విధానం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల అటు ఆయుర్వేదిక్ వైద్య విధ్యార్థులకు, ఇటు అలోపతి వైద్య విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు.
Last Updated : Dec 11, 2020, 5:51 AM IST