AP governor: ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. త్వరగా కోలుకోవాలని తమిళిసై ఆకాంక్ష - ap news updates
10:58 November 17
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(ap governor bishwabhushan)అస్వస్థతకు గురయ్యారు. దిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ఆయన.. గత రెండు రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీసీపీసీఆర్ పరీక్ష చేయించారు. స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్‌కి ప్రత్యేక విమానంలో తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో గవర్నర్‌కు చికిత్స అందిస్తున్నారు.
ఏపీ గవర్నర్ ఆరోగ్యం బాగుండాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై (Telangana governor tamilisai) తెలిపారు. బిశ్వభూషణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బిశ్వభూషణ్ త్వరగా కోలుకుని దేశానికి సేవచేయాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:MLC Elections 2021: మండలి స్థానాలకు నామినేషన్లు.. ఆరూ తెరాసకే!!