హైదరాబాద్ కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్‌లో ప్రభుత్వ భూమిలో అక్రమంగా వెలిచిన నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూల్చివేశారు.
ప్రభుత్వభూమిలో అక్రమకట్టడాలు.. కూల్చేసిన అధికారులు.. - అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు
కూకట్‌పల్లి హైదర్‌నగర్ పరిధిలోని గోపాల్ నగర్‌లో అక్రమ నిర్మాణాలు వెలిశాయని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు 30 అక్రమ కట్టడాలను కూల్చివేశారు.
అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు
హైదర్‌నగర్ పరిధిలోని గోపాల్ నగర్‌లో సర్వే నెంబర్ 148 నుంచి 155వరకు ఉన్న లే అవుట్ పార్కు స్థలంలో 30 అక్రమ నిర్మాణాలు వెలిశాయని స్థానికులు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడారు.
ఇదీ చూడండి :జీహెచ్ఎంసీ ఎన్నికల కసరత్తు.. రాజకీయ పార్టీలకు ఈసీ లేఖలు