కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెనలో అరుణాచల్‌ప్రదేశ్ నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌లోకి తరలిస్తున్న మద్యాన్ని ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల గ్రామానికి చెందిన వీరంకి వెంకట రమణ మొక్కజొన్న లోడు లారీలో 142 కేసుల మద్యం తరలించాడు.
అరుణాచల్ ప్రదేశ్ నుంచి అక్రమమద్యం సరఫరా - ఆంధ్రప్రదేశ్‌లో ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తున్న అక్రమ మద్యం స్వాధీనం
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో... కొంతమంది వ్యక్తులు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తెస్తున్నారు. ఇలా తీసుకొస్తున్న మద్యం సీసాలను కృష్ణా జిల్లా మంతెనలో ఏపీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ మద్యం పట్టివేత
వాటిలో కొన్నింటిని ఇతరులకు అమ్మగా... గన్నవరం మండలంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలో అవి బయటపడ్డాయి. వారిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంకటరమణ గడ్డివాముల కింద దాచిన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి : జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా