తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇళ్ల స్థలాల ఎంపికలో 'రాజకీయం'.. ఏపీ ప్రభుత్వంపై ఆర్థిక భారం! - చిత్తూరుల జిల్లాలో ఇళ్లస్థలాల్లో అక్రమాలు

ప్రతి పని వెనక ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. నాయకులైతే.. స్వార్థం లేకుండా ఏపనీ చేయరంటారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఇళ్ల స్థలాల ఎంపిక జరుగుతోంది. అందులో జిల్లాలోని కొందరు నేతలు రాజకీయ కోణాన్ని ఎంచుకున్నారు. అనువైన భూములు అందుబాటులో ఉన్నా... గుట్టలు.. పుట్టలు. చెట్లున్న ప్రాంతాలను పేదల ఇళ్ల స్థలాలకు ఎంపిక చేశారు. కొందరు తమ వ్యక్తిగత స్వార్థం కోసం పేదల ఇళ్లకు గుట్టలను ఎంపిక చేయించారు. ఈ ప్రాంతంలో భవిష్యత్తులో మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి. ప్రస్తుత ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎంత వరకు సాధ్యమన్నది వారికే తెలియాలి మరి.

ఇళ్ల స్థలాల ఎంపికలో 'రాజకీయం'.. ఏపీ ప్రభుత్వంపై ఆర్థిక భారం!
ఇళ్ల స్థలాల ఎంపికలో 'రాజకీయం'.. ఏపీ ప్రభుత్వంపై ఆర్థిక భారం!

By

Published : Jun 22, 2020, 2:20 PM IST

ఏపీ పాకాల మండలం పులివర్తివారిపల్లెకు పక్కనే చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వెనుక వైపున ఎస్టీ కాలనీ ఉంది. ఇక్కడ చుట్టూ కొన్ని ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. ఎవరికైనా ఇళ్ల స్థలాలు ఇస్తే భవిష్యత్తులో మరింత అభివృద్ధికి అవకాశం ఉంది. సమీపంలోనే మరికొందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. నేల చదును కూడా సులభంగా పూర్తి అవుతుంది. గ్రామస్థులు కూడా ఇక్కడే స్థలాలు ఇవ్వమని సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు.

ఇక్కడ కాకుండా గ్రామానికి ముందు భాగంలో స్థానికులు పశువులు మేపుకొనే గుట్టను ఇళ్ల స్థలాలకు ఎంపిక చేశారు. గుట్ట చదునుకు భారీగా నిధులు వెచ్చించాల్సి ఉంది. భవిష్యత్తులో మౌలిక సదుపాయాల కల్పన కష్టంగానే ఉంటుంది. గ్రామస్థుల అభీష్టానికి వ్యతిరేకంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా ఇక్కడుండే వారికి భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రాజకీయ స్వార్థం ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్న గ్రామానికి ముందు భాగంలో ఇతరులను తీసుకువచ్చి రాజకీయంగా లాభపడాలనేది ఓ ప్రజాప్రతినిధి లక్ష్యమనే విమర్శలు వస్తున్నాయి.

దారేలేని చోట స్థలాలా?

ఏపీ చంద్రగిరి మండలం నడింపల్లె నుంచి ముంగిలిపట్టు మీదుగా కొంగరవారిపల్లె వరకు రైల్వే ట్రాక్‌, దట్టమైన అటవీప్రాంతం వెంబడి ఎకరాల కొద్దీ డీకేటీ భూములను ఇళ్ల స్థలాలకు ఎంపిక చేశారు. ఇప్పటికే వందలాది ఇళ్ల స్థలాలను సిద్ధం చేసి సరిహద్దులు గుర్తించారు. ఇంకా భూములను స్వాధీనం చేసుకోవడం, చదు ను చేస్తున్నారు. ఇక్కడా రాజకీయ కోణం ఉంది.

తనకు అనుకూలంగా లేని గ్రామాల వద్ద డీకేటీ భూములను లేకుండా చేయాలనే లక్ష్యంతో ఎంపిక జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికులకు ఇచ్చే పక్షంలో అభ్యంతరాలు రావడంలేదు. అయితే తిరుపతి రూరల్‌ ప్రాంతాలకు చెందిన వారికి ఇక్కడ స్థలాలు ఇవ్వాలనే ప్రయత్నం గుట్టు చప్పుడుగా సాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ స్థలాలకు దారి సమస్య ఉంది. రైల్వే ట్రాక్‌ దాటుకుని కొన్ని స్థలాల వద్దకు వెళ్లాల్సి ఉంది. మరికొన్ని స్థలాలకు దారే లేదు.

పేదలను కొండెక్కిస్తున్నారు

చిత్తూరు నగరంలోని తేనెబండలో చదునైన భూములు ఉండగా ఇక్కడ కాకుండా మురకంబట్టు సమీపంలో గుట్టపైన స్థలాలను ఎంపిక చేశారు. ఇక్కడ రూ.లక్షలు వెచ్చించి చదును చేసే పనులు జరుగుతున్నాయి. తేనెబండలో ఓ ప్రజాప్రతినిధి తన గ్రానైట్‌ క్వారీ కోసం కేటాయించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే తనకు ఇబ్బందిగా ఉంటుందని... స్థానిక నేతల అభిప్రాయాన్ని కూడా కాదని మురకంబట్టు గ్రామానికి దూరంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించడానికి చదును చేసే పనులు జరుగుతున్నాయి. తద్వారా సర్కారుపై అదనపు భారం పడనుంది.

ఇవీ చూడండి:మందు లేని మాయదారి రోగం కరోనా.. అంటూ పాటతో అవగాహన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details