హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని నోటిసులు జారీ చేసినప్పుటికీ పెడచెవిన పెట్టడం వల్ల కూల్చివేతలకు పాల్పడుతున్నారు. మెహదీపట్నం ఎన్‌ఎండీసీ వద్ద అక్రమంగా నిర్మించిన 6అంతస్తుల భవనాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. నగర పోలీసుల సహకారంతో టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ భవనాన్ని జేసీబీలతో నేలమట్టం చేస్తున్నారు.
అక్రమ కట్టడాలపై కొరడా.. ఆరంతస్తుల భవనం కూల్చివేత - హైదరాబాద్ తాజా వార్తలు
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. మెహదీపట్నం ఎన్‌ఎండీసీ వద్ద అక్రమంగా నిర్మించిన 6అంతస్తుల భవనాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులతో భవన యాజమాని వాగ్వాదానికి దిగారు.
అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనం కూల్చివేత
ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులతో భవన యాజమాని వాగ్వాదానికి దిగారు. దీంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కూల్చివేత పనులను అసిస్టెంట్ పోలీసు కమిషనర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భవనం కూల్చివేస్తున్న ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు.
ఇదీ చూడండి :వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్
TAGGED:
hyderabad latest news