హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ఆరో రోజుకు చేరిందని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. గురుకుల ట్రస్ట్ భూముల్లో నిర్మాణంలో ఉన్న మరో 10 భవనాలను ఇవాళ కూల్చేశామన్నారు.
ఆరో రోజుకు చేరిన అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం - demolition special drive
నగరంలో చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం ఆరో రోజు కొనసాగింది. గురుకుల ట్రస్ట్ భూముల్లో నిర్మాణంలో ఉన్న 10 భవనాలను కూల్చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పేర్కొన్నారు.
illegal buildings demolition program continues on sixth day in hyderabad
పలు బహుళ అంతస్తుల భవనాలను కూడా కూల్చివేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సర్వే నిర్వహించి... నగరంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. అక్రమంగా నిర్మాణాలు చేపడితే సహించేది లేదని లోకేశ్‌కుమార్ హెచ్చరించారు.