కూకట్పల్లిలోని మూసాపేట్ కూడలి వద్ద రోడ్డు పక్కనే చేపడుతున్న అక్రమ భవన నిర్మాణాన్ని ఎన్ఫోర్స్మెంట్, జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు పోటెత్తడంతో అధికారులు వాటిని తొలగించేందుకు సిద్ధమయ్యారు.
మూసాపేట్లో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసిన అధికారులు - Illeagal constructions demolished in moosapet
హైదరాబాద్ కూకట్పల్లిలోని మూసాపేట్ కూడలిలో అక్రమ నిర్మాణాన్ని ఎన్ఫోర్స్మెంట్, జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. భవన నిర్మాణదారుడు వారిని అడ్డుకోవడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
మూసాపేట్లో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసిన అధికారులు
భవనాన్ని కూల్చివేసేందుకు వచ్చిన అధికారులను నిర్మాణదారుడు అడ్డుకోవడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బందోబస్తు మధ్య తొలగింపు కార్యక్రమం చేపట్టారు. రహదారి నిర్మాణ సమయంలో తాము స్థలం కోల్పోయామని భవన యాజమాని ఆరోపించాడు.