ఈసీపై విశ్వాసం ఉంది: చంద్రబాబు - BABU IN ALL PARTY MEETING
పోలైన ఓట్లలో ఒక్క శాతం మాత్రమే లెక్కిస్తున్నారని... ఈవీఎంలలో అవకతవకలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఈసీపై విశ్వాసం ఉంది: చంద్రబాబు
సాంకేతికంగా ముందున్న దేశాలు సైతం పేపర్ బ్యాలెట్ పద్ధతే పాటిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. 23 పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం అధికారులను కలిసిన ఏపీ సీఎం... పోలైన ఓట్లలో ఒక్క శాతం మాత్రమే లెక్కిస్తున్నారని పేర్కొన్నారు. ఈవీఎంలలో అవకతవకలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. ఎన్నికల సంఘం సరైన నిర్ణయం తీసుకుంటుందనే విశ్వాసం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.