తెలంగాణ

telangana

ETV Bharat / state

IICT: సేంద్రియ ఎరువు తయారీలో సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేసిన ఐఐసీటీ - ఐఐసీటీ అనరోబిక్ కంపోస్ట్ ఎరువు

IICT: సేంద్రియ ఎరువు తయారీలో హైదరాబాద్‌ సీఎస్‌ఐఆర్- ఐఐసీటీ శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని ఆవిష్కరించారు. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత సేంద్రియ ఎరువులను మరింత చేరువ చేసేలా.. యాక్సిలరేటెడ్ అనరోబిక్ కంపోస్ట్ ఎరువును అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఎరోబిక్, వర్మీ కంపోస్టింగ్‌ అనే రెండు విధానాల్లో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఈ పక్రియలో వాతావరణం కలుషితమయ్యేలా కొన్ని వాయువులు వెలువడుతుంటాయి. దుర్వాసనతో పరిసరవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సమస్యలన్నీ లేకుండా ఏఏసీ విధానాన్ని అందుబాటులోకి వచ్చింది.

iict
iict

By

Published : Sep 1, 2022, 8:49 AM IST

సేంద్రియ ఎరువు తయారీలో సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేసిన ఐఐసీటీ

IICT: ఐఐసీటీ అభివృద్ధి చేసిన ఏఏసీ విధానంలో గాలి లేకుండానే కంపోస్ట్ ఎరువును తయారు చేస్తారు. ఎలాంటి దుర్వాసన కూడా వెలువడదు. 250 కిలోల వ్యర్థాలు వచ్చే మార్కెట్‌లోని అనువైన ప్రదేశంలో 6 గుంతలు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక యంత్రంలో వేసి సేంద్రియ వ్యర్థాలను చిన్న, చిన్న ముక్కలుగా చేసి.. మొదటి రోజు మొదటి గుంతలో వేస్తారు. దీనిపై కొంత బ్యాక్టీరియా కల్చర్‌ వేసి మూసివేసి.. ఐదు రోజుల తర్వాత రెండో గుంతలో వ్యర్థాలు వేస్తారు. నెల తర్వాత మొదటి గుంత నుంచి 100 కిలోల వరకు సేంద్రియ ఎరువు తయారవుతుంది.

ఈ విధానంలో తయారైన ఎరువులను రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వినియోగిస్తోంది. తొలిసారిగా సూర్యాపేటలో ఏర్పాటు చేసిన యూనిట్‌ దేశానికే ఓ ఆదర్శ నమూనాగా నిలిచింది. ఇక్కడి ప్లాంట్‌ నుంచి రోజూ 75 కిలోల వరకు సేంద్రియ ఎరువు ఉత్పత్తి చేస్తున్నారు. కిలో 15రూపాయల చొప్పున రైతులు, మిద్దె తోటల నిర్వాహకులకు విక్రయిస్తున్నారు. ఇప్పుడు తార్నాకలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్లాంట్​ను సందర్శనకు అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 46 ఈ-నామ్ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ తరహా ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించారు.

సాధారణంగా 250 కిలోల సామర్థ్యం గల యాక్సిలరేటెడ్ అనరోబిక్ కంపోస్ట్ యూనిట్ ఏర్పాటుకు రూ.7 లక్షల వరకు ఖర్చవుతుంది. రోజూ 100 కిలోల వరకు ఉత్పత్తయ్యే సేంద్రియ ఎరువు కిలో 15 రూపాయల చొప్పున అమ్ముకున్నా.. నెలకు 45 వేల రూపాయల ఆదాయం పొందవచ్చు. ఇలా ఈ కేంద్రాలు యువత, అంకుర కేంద్రాలు, స్వయం సహాయక మహిళలకు ఉత్తమ ఆదాయ వనరుగా మారుతుందనడంలో సందేహం లేదు.

"ఈ విధానంలో మొదట ఆరు పిట్లు కడతాం. ఆరు పిట్లలో ఒక్కొక్కటి 2500 లీటర్లు ఉంటుంది. మొదటి రోజు మొదటి గుంతలో వేస్తారు. దీనిపై కొంత బ్యాక్టీరియా కల్చర్‌ వేసి మూసివేసి.. ఐదు రోజుల తర్వాత రెండో గుంతలో వ్యర్థాలు వేస్తారు. నెల తర్వాత మొదటి గుంత నుంచి 100 కిలోల వరకు సేంద్రియ ఎరువు తయారవుతుంది." -డా.గంగాగ్నిరావు, ఐఐసీటీ

ఇవీ చదవండి:భాజపా ముక్త్‌ భారత్‌ కోసం కలిసి పనిచేస్తాం: కేసీఆర్‌

రాష్ట్రంలో రేపటి నుంచి కేంద్ర మంత్రుల పర్యటన..

ABOUT THE AUTHOR

...view details