తమ ప్రభుత్వం అన్ని మతాలకు సమ ప్రాధాన్యతను ఇస్తుందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముస్లీం సోదరుల అభివృద్ధి కోసం తెరాస ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రేపు ఎల్బీ స్టేడియంలో ఇవ్వనున్న ఇఫ్తార్ విందు ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఇఫ్తార్ విందు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రేపు సాయంత్రం ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మత పెద్దలు హాజరవుతారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో మంచి ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి తెలిపేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
రేపు తెలంగాణ సర్కారు ఇఫ్తార్ విందు
అన్ని కులాలను, మతాలను సమాన దృష్టితో చూస్తూ... అందరికీ సమ ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రేపు ఎల్బీ స్టేడియంలో సర్కారు నిర్వహించబోయే ఇఫ్తార్ విందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు.
రేపు తెలంగాణ సర్కారు ఇఫ్తార్ విందు