టీఎన్జీఓ ఆధ్వర్యంలో దావత్-ఈ-ఇఫ్తార్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ముజీబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్ ముందు జరిగిన ఇఫ్తార్ పార్టీలో ముఖ్య అతిథిగా హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఒకరికొకరు కాజూ తినిపించుకొని ఉపవాస దీక్షను విరమింపజేశారు.
అనంతరం ప్రార్థనలు చేసి విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, దిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, డిప్యూటీ మేయర్ బాబా ఫసిదుద్దీన్ తోపాటు...టీఎన్జీవో నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
'టీఎన్జీఓ కేంద్ర కార్యాలయంలో ఇఫ్తార్ వేడుకలు' - MAHMOOD ALI
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇఫ్తార్ వేడుక నిర్వహించారు. ఆ సంఘం కేంద్ర కార్యాలయంలో ఒకరికొకరు కాజు తినిపించుకుని దీక్ష విరమించారు. అనంతరం విందులో పాల్గొన్నారు.
ఒకరికొకరు కాజూ తినిపించుకొని ఉపవాస దీక్షను విరమించారు
ఇవీ చూడండి : వనస్థలిపురం చోరీ: సులభ్కాంప్లెక్స్లో మతలబు!