తెలంగాణ

telangana

ETV Bharat / state

హాస్టల్స్ తెరవాలంటూ ఇఫ్లూ విద్యార్థుల ఆందోళన - యూనివర్సిటీ ముందు విద్యార్థుల ధర్నా

సికింద్రాబాద్​లోని తార్నాకలో ఇఫ్లూ వర్సిటీలో హాస్టల్స్ వెంటనే ఓపెన్ చేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కరోనా సమయంలో ఆన్​లైన్​ క్లాసులకే పరిమితం కావడంతో గతంలో వసతి గృహాలు మూసివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎన్నికల కోడ్ ఉన్నందున విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

Iflu students dharna to re open hostels in campus at tarnaka in secunderabad
హాస్టల్స్ తెరవాలంటూ ఇఫ్లూ విద్యార్థుల ఆందోళన

By

Published : Mar 15, 2021, 3:46 AM IST

హాస్టల్స్ వెంటనే ఓపెన్ చేయాలంటూ ఇండియన్​ ఫారిన్​ లాంగ్వేజెస్​ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్​లోని తార్నాకలో వర్సిటీ గేటు ముందు నినాదాలు చేశారు. కరోనా సమయంలో ఆన్​లైన్​ క్లాసులకే పరిమితం కావడంతో గతంలో వసతి గృహాలు మూసివేశారు. దీంతో విద్యార్థులు క్లాసులు ప్రారంభించాలని.. హాస్టల్స్ ఓపెన్ చేయాలని ధర్నా చేపట్టారు.

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నందున అధికారికంగా ఏలాంటి ఆదేశాలు రాకుండా హాస్టల్స్ ఓపెన్ చేసే అవకాశం లేదని ఇఫ్లూ అధికారులు వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి 15 మంది విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎన్నికల కోడ్ ఉన్నందున విద్యార్థులను అదుపులోకి తీసుకుని ఓయూ పీఎస్​కు తరలించారు.

ఇదీ చూడండి:నేటి నుంచే రాష్ట్ర వార్షిక బడ్జెట్​ సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details