హైదరాబాద్ నగరంలో వాహనాల హారన్లతో పెరుగుతున్న శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు కొత్త పంథా ఎంచుకున్నారు. మోటార్ వాహన చట్ట ప్రకారం వాహనాలకున్న హారన్లు కాకుండా మల్టీ సౌండ్ హారన్లు వినియోగిస్తున్న వారిని జైలుకు పంపనున్నారు. తొలుత హారన్లు స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు వాహనదారులకు మూడు నెలలు గడువు ఇవ్వనున్నారు. ఆ లోపు బహుళ శబ్దాల హారన్లు తొలగించకపోతే వారిపై కోర్టుల్లో అభియోగ పత్రాలు సమర్పించనున్నారు. జైలుశిక్ష విధించాలంటూ అభ్యర్థించనున్నారు.
రోడ్డుపై హారన్ మోగిస్తూ వెళ్తున్నారా?.. అయితే మీరు ఇక జైలుకే!!
Sound Pollution in City:హైదరాబాద్ రహదారులపై ఇష్టారాజ్యంగా హారన్ మోగిస్తూ వెళ్తున్నారా..? ముందున్న వాహనాలు పక్కకు జరగాలంటూ హారన్ కొడుతున్నారా..? అయితే మీరు జైలుకు వెళ్లక తప్పదు.. హారన్ మోగిస్తే.. జైలుకా.. అని ఆశ్చర్యపోతున్నారా... అయితే కింది కథనం చదవండి..
ఆర్టీసీ, ప్రైవేటు బస్సులపై నజర్ : పగలూరాత్రి తేడా లేకుండా రహదారులపై వాహనాలున్నా, లేకపోయినా హారన్లు మోగించుకుంటూ రోడ్లపై దూసుకెళ్తున్న ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. సౌండ్ మీటర్ తనిఖీచేసి పరిమితికి మించి శబ్దమున్న వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. మరీ ఎక్కువ హారన్లు వినియోగిస్తున్న వారిపై పెట్టీ కేసులు నమోదు చేస్తున్నారు. ‘చెవులు, మెదడుకు హాని కలిగించేలా హారన్లున్న వాహనాలను గుర్తించి వారం రోజుల్లో 2వేల హారన్లు స్వాధీనం చేసుకున్నాం.’ అని సంయుక్త కమిషనర్(ట్రాఫిక్) ఏవీ.రంగనాథ్ తెలిపారు.
ఇవీ చూడండి: